calender_icon.png 16 August, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిధిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉండరాదు

16-08-2025 05:24:11 PM

గాంధారి (విజయక్రాంతి): గాంధారి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో అదేవిధంగా మండల కేంద్రంలోని శిధిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఎవ్వరు కూడా ఉండరాదని గాంధారి గ్రామపంచాయతీ సెక్రటరీ నాగరాజు(Gram Panchayat Secretary Nagaraju) సూచించారు. శని, ఆదివారం ఈ రెండు రోజులలో భారీ వర్షాలు ఉన్నందువలన గాంధారి గ్రామపంచాయతీ ప్రజలు అత్యవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్లకూడదని వాగులు, చెరువులు, కుంటలు వాటి వద్దకు వెళ్లకూడదని, కరెంట్ స్తంభాలు, కరెంటు మనమ్మతులు చేయకూడదని ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే తనకు కానీ,గ్రామపంచాయతీ సిబ్బందికి గాని తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియ చేయాలని ఆయన సూచించారు.