calender_icon.png 16 August, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేండి వాగును పరిశీలించిన అధికారులు

16-08-2025 05:19:31 PM

మద్నూర్(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామ సమీపంలో ఉన్న లెండి వాగును  శనివారం రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న అన్న సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన వాగు వద్దకు వచ్చారు.

నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలియజేశారు. వరద ఉధృతి ఎప్పుడైనా రావచ్చునాని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రవహిస్తున్న వాగు నుంచి ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయవద్దని గ్రామస్తులకు వారు సూచించారు. తాసిల్దార్ ముజీబ్, బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై విజయ్ కొండ ఉన్నారు.