calender_icon.png 16 August, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పురస్కారానికి డాక్టర్ బాలు..

16-08-2025 05:22:14 PM

న్యూఢిల్లీలో పురస్కారాన్ని అందజేయనున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districrt) కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం, వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేసినందుకు గాను ఐవిఎఫ్ జాతీయ పురస్కారాన్ని 19వ తేదీ మంగళవారం రోజున లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ చే న్యూఢిల్లీలోని హోటల్ ది అశోక్ లో అందుకోవడం జరిగుతుందని తెలియజేశారు. ఈ అవార్డును అందుకోవడానికి సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.