calender_icon.png 17 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు

16-08-2025 05:35:31 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ లో సందడి వాతావరణం నెలకొంది. వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లె గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ లో జన్మాష్టమి నేపథ్యంలో శ్రీ కృష్ణుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారినీ దర్శించుకొని తరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తి భజన పాటలతో మార్మోగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ప్రభు గణేష్ అన్నప్రసాదం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఆరేపల్లె మాజీ సర్పంచ్ మల్లేశం బిజెపి నాయకుడు రాజిరెడ్డి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్. సింగిల్ విండో డైరెక్టర్ కట్ట శ్రీనివాస్. పార్వతి అంజి. గ్రామస్తులు మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.