calender_icon.png 5 November, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి

05-11-2025 12:17:01 AM

కోదాడ (నడిగూడెం)నవంబర్ 4: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఎండి ఖలీల్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో  ఈ నెల 7 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికై  హైదరాబాదులో  ఇందిరా పార్క్ వద్ద చేపట్టి భారీ నిరసన దీక్ష గోడ పోస్టర్లను  పెన్షనర్లతో కలిసి ఆవిష్కరిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని, పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల సాధనకై ఈ నెల 7న చేపట్టిన దీక్షకు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బాలాజీ నాయక్, ఇబ్రహీం, అప్పిరెడ్డి, అంజయ్య, అనంతరాములు, వెంకటరెడ్డి, నరసింహారావు, సైదులు, రాములు,   జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.