calender_icon.png 23 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్ను కలవాలని.. ఎదురుచూస్తున్నారు

23-09-2025 12:16:14 AM

పవన్‌కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్.. ఓజాస్ గంభీరగా అలరించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదలైంది.

‘వాళ్ల ఎదుట నిలబడి గెలివడానికి మాత్రం ఒక్కడే’, ‘నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు’ వంటి డైలాగులు ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ రాకతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇంతకుముందు ఎన్నడూ చూడని లుక్‌లో పవన్‌కల్యాణ్ సరికొత్తగా కనిపించారు. ఛాయాగ్రాహకులు రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్‌తో కట్టిపడేశారు. నవీన్ నూలి ఎడిటింగ్, తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి.