23-09-2025 12:15:05 AM
ఈ ఏడాది ప్రథమార్ధంలో ‘స్వాగ్’, ‘సింగిల్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడాయన కథానాయకుడిగా మ రో సినిమా రూపొందుతోంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోన వెంక ట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్‌ను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహిమ నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్‌టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, బ్రహ్మాజీ, సత్య, మురళీధర్‌గౌడ్, సునైనా, బుల్లిరాజు, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడి గా, సాయిశ్రీరామ్ డీవోపీగా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా ఉన్నారు.