calender_icon.png 29 January, 2026 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహం, పతంగి వైపు ‘రెబల్స్’ చూపు

29-01-2026 12:00:00 AM

కరీంనగర్, జనవరి 28 (విజయక్రాంతి): మునిసిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల రెబ ల్స్ సింహం, పతంగి గుర్తుల వైపు చూస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోయినప్పటికి.. సింహం సింబల్ ఆ పార్టీకి క్రేజ్నిస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రా ని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికె ట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు.

తెలంగాణ జాగృతి కవిత కూ డా తమ పార్టీ సింబల్ ఇప్పట్లో రాదు కనుక మున్సిపల్ ఎన్నికల్లో క్యాడర్ ని సింహం గుర్తుపై దించాలని చూస్తున్నారు అంటే ఏ ఐ ఎఫ్ బి కి ఎంత డిమాండ్ ఉందో చెప్పవచ్చు. సింహం ధైర్యానికి.. సాహసానికి మారు పేరుగా చెప్పుకుంటారు. ప్రధాన రా జకీయ పార్టీలను వీడి ధైర్యం చేసేవారు సిం హంలా పోరాడుతున్న అనే సంకేతాలను ఇ స్తూ ప్రచారంలో దిగాలని చూస్తున్నారు. కరీంనగర్ నగరంలో 15 డివిజన్లలో మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉండటంతో ఆయా పార్టీలలో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు బి సి, ఎస్ సి రిజర్వు అయినచోట ఎంఐఎం టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. 

ఎంఐఎం తో పాటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ బాగానే ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాలతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1939 మే 3న ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు సుభాష్ చంద్ర బోస్. ఒకప్పుడు బెంగాల్లో సిపిఎం తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నప్పటికి కాలక్రమేనా పార్టీ జనదరణకు దూర మైంది. ఇప్పుడు తెలంగాణలో రెబల్స్ కి కేరాఫ్గా మారుతోంది. ఈ రెండు పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీలలో టికెట్లు రాకుంటే తమకు ఇవ్వాలని దస్తి వేసి పెట్టారు.