calender_icon.png 29 January, 2026 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోశారు

29-01-2026 12:00:00 AM

  1. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు కేవలం 28.5 శాతం తగ్గించి బీసీల గొంతు కోశారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, రాహుల్ గాంధీ వాగ్దానం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 15 బీసీ సంఘాల సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిధిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 42 శాతం బిసి రిజర్వేషన్లను గత పంచాయతీరాజ్‌లో అమలు చేయకాపోగా, మున్సి పాలిటీల్లో కూడా అమలు చేయకపోవడం దారుణం అన్నారు. మున్సిపాలిటీల్లో గత ఎన్నికలలో 34 శాతం అమలు చేశారని, ఇప్పుడు దానిని 28 శాతం తగ్గించడం రాజకీయంగా బీసీలను అణచివేయడమే అన్నా రు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, నీల వెంకటేష్, పగిళ్ళ సతీష్, అనంతయ్య, రాజేందర్, రాజు నేత, మోడీ రాందేవ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.