04-08-2025 12:01:14 AM
-బైకుల మీదకు దూసుకెళ్లిన వాహనం
-ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో లారీ బీభత్సం సృష్టించింది. భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో బైక్‌లపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. గ జ్వేల్ నుంచి ఓవర్ లోడ్‌తో వస్తున్న లారీ బ్రే కులు ఫెయిల్ అయి జగదేవ్‌పూర్ రోడ్డు చౌ రస్తాలో ఓ షాపులో ముందున్న బైక్‌ల మీది కి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్ సూరారానికి చెందిన రామకృష్ణ యాదవ్ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న సా యియాదవ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవ్యక్తి రా మన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రా మానికి చెందిన శివకు గాయాలయ్యాయి. ఈ బీభత్సంలో బైక్‌లు నుజ్జునుజ్జు అయ్యా యి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ చక్రాల కింద ఇరుక్కున్న మృతదేహాన్ని క్రేన్ సాయంతో తీశారు.
గాయపడ్డ శివను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరంతా భువనగిరిలో జరిగిన బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి షాపు వద్ద నిలుచుండగా లారీ రూ పంలో మృత్యువు కబలించింది. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. లారీ డ్రైవర్, క్లీనర్‌ను పో లీసుల అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలను తె లుసుకున్నారు. జగదేవ్‌పూర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఈ చౌరస్తా ను జంక్షన్‌గా మార్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.