calender_icon.png 29 August, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటతోనే ఆరోగ్యం

29-08-2025 03:26:58 AM

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భం గా ప్రతి ఏటా ఆగస్టు 29న దేశవ్యాప్తంగా ‘జాతీయ క్రీడా దినోత్సవం’ నిర్వహించడం ఆనవాయితీ.  యువతీ, యువకుల దృష్టిని క్రీడల వైపు ఆకర్షించడం, క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం, స్నేహం, సమాన త్వం, క్రీడా విలువలను కాపాడటం, ఆటలతో ఆరోగ్యకర పౌర సమాజా న్ని నిర్మించడం, క్రీడా ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడం, జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం, జాతి ఐక్యతను పెంపొందించడం, గెలుపోటములను సమానంగా తీసుకునే తత్వాన్ని అలవర్చుకోవడం లాంటి ప్రయోజనాలను సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం అనే లక్ష్యం తో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఈ నెల 29 నుంచి 31 వరకు మూ డు రోజుల పాటు క్రీడా కార్యక్రమాలు నిర్వహించనుంది. ‘సమ్మిళిత సమా జ నిర్మాణం, శాంతియుత సమాజ స్థాపనకు క్రీడలు’ అనే ఇతివృత్తంతో ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఏక్ గంటా.. ఖేల్ కే మైదాన్ మే’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు.

జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రతి ఏటా అత్యుత్తమ క్రీడా కారులకు ఖేల్ రత్న, ద్రోణాచార్య, అర్జున అవార్డులతో సత్కరించడం సం ప్రదాయం. 1905 ఆగస్టు 29న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించిన ధ్యాన్ చంద్ పాఠశాల విద్య అనంతరం 1922లో భారత ఆర్మీలో సైనికుడిగా చేరారు. తన సీనియర్ అధికారి ప్రోద్భలతంతో హాకీ స్టిక్‌ను చేత పట్టిన ఆయన హాకీలో మేటి క్రీడాకారుడిగా ఎదిగారు. ఒలింపిక్స్‌లో హాకీ లో మూడు బంగారు పతకాలు పొందిన భారత జట్టులో ధ్యాన్‌చంద్ ప్ర ధాన ఆటగాడిగా ఉన్నారు.

1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా సేవలు అందించారు. హాకీ క్రీడా జీవితంలో ధ్యాన్ చంద్ 1926 ను ంచి 1948 వరకు 500లకి పైగా అంతర్జాతీయ గోల్స్ చేయడం విశేషం. ధ్యాన్‌చంద్ అద్భుత క్రీడా ప్రతిభకు గుర్తింపుగా 2012 నుంచి ఆయన పు ట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా పాటిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వం 1956లో ధ్యాన్‌చంద్‌కు పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.

నేటి యువత వీడియో గేమ్స్ పట్ల చూపుతున్న ఆసక్తితో క్రీడలకు దూరం అవుతున్నారు. విద్యాలయాల్లో కూడా మార్కులు, ర్యాంకులు అం టూ యువతను క్రీడలకు దూరం చేయడం జరుగుతోంది. మైదానంలో క్రీడల పట్ల నేటి పిల్లలకు చిన్నతనంలోనే ఆసక్తి వచ్చేలా చూడాలి. ఆటల తో శారీరక ఆరోగ్యం, మానసిక చురుకుదనం పెరుగుతాయనే అవగాహనను కల్పించాలి. రేపటి ఆరోగ్య భారత్ నిర్మాణానికి నేటి పిల్లలు, యువత అహర్నిశలు కృషి చేయాలని కోరుకుందాం.

  వ్యాసకర్త: డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి