calender_icon.png 6 January, 2026 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధుల జీవితంలో వెలుగులు నింపింది లూయిస్ బ్రెయిలీ

05-01-2026 12:00:00 AM

కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్, జనవరి 4 (విజయక్రాంతి): అందులో జీవితాల్లో వెలుగులు నింపింది మహనీయులు  లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డ లోని శిశు గృహ లో లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వేడుకల ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం తో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధులు సామాన్యులతో సమానంగా అన్ని రం గాల్లో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు.

దివ్యాంగులు సమావేశంలో సలహాలు, సూచనలు, ఇబ్బందులను ప్రస్తావనకు తీసుకువచ్చారని తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రతి నెల మొదటి బుధవారం దివ్యాంగులు,సీనియర్ సిటిజన్ లకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన సమస్యలు పరిష్కారంకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ సంక్షేమ అధికారిణి జరీనా బేగం, అంధుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీ రాములు, డాక్టర్ రమ్య, దివ్యాంగులు, వయో వృద్ధులు పాల్గొన్నారు.