25-04-2024 01:29:49 AM
నికరలాభం రూ.1,100 కోట్లు
ముంబై, ఏప్రిల్ 24: దేశంలో ఐదవ పెద్ద ఐటీ కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాల్ని చేరుకోలేకపోయాయి. 2024 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గత ఏడాది క్యూ4తో పోలిస్తే 1.2 శాతం తగ్గి రూ.1,100 కోట్ల వద్ద నిలిచింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 5.9 శాతం క్షీణించింది. ఆదా యం సైతం త్రైమాసికంవారీగా 1.4 శాతం, గత క్యూ4కంటే 2.3 శాతం తగ్గి రూ.8,892 కోట్లకు చేరింది. మార్జిన్లు కూడా బాగా తగ్గాయి. క్యూ3లో 15.4 శాతం మార్జిన్లను సాధించిన ఎల్‌టీఐ మైండ్‌ట్రీ క్యూ4లో 14.7 శాతం మాత్రమే కనపర్చింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.45 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది.
తగ్గిన ఉద్యోగుల సంఖ్య
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సైతం ఇతర ఐటీ కంపెనీల్లానే ఉద్యోగులను తగ్గించుకుంది. 2024 మార్చి 31నాటికి కంపెనీ రోల్స్‌లో 81,650 మంది ఉద్యోగులు ఉన్నారు. క్యూ3కంటే ఈ సంఖ్యలో 821 మంది తగ్గారు. వలసల రేటు గత త్రైమాసికంతో పోలిస్తే 14.2 శాతం నుంచి 14.4 శాతానికి పెరిగింది.