19-09-2025 12:25:29 AM
నంగునూరు, సెప్టెంబర్ 18:నంగునూరు మండలం నర్మేట లో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాల ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు.మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ హజ్మాన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్యాక్టరీలోని యంత్రాలను పరిశీలించి ట్రైల్ రన్ నిర్వహించారు.
అనంతరం ఫ్యాక్టరీ పురోగతిపై సమీక్షించారు.యంత్రాల పనితీరు పట్ల టి.జి.ఓ.యిల్.ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య సంతృప్తి వెళ్తాం చేశారు.భవిష్యత్తులో ఫ్యాక్టరీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డా. కిరణ్ కుమార్ ఓ.ఎస్.డి,శ్రీకాంత్ రెడ్డి ప్రాజెక్ట్ మేనేజర్, ప్రణేష్ గౌడ్, ప్రి యూనిక్ ఇండియా కంపెనీ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.