calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి

19-09-2025 12:24:45 AM

డీఓస్‌పీ. ఎన్ లింగయ్య 

నారాయణపేట.సెప్టెంబర్,17(విజయక్రాంతి) : కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు డీఓస్‌పీ. ఎన్ లింగయ్య  డీఎస్పీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సిఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకొని ఈ సందర్భంగా డీఓస్‌పీ. మాట్లాడుతు గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు.

ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్‌ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలి. కేసుల్లో శిక్షల శాతం పెంచాలి. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాట పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలి.

ఫోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కేసులను అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైనల్ చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి,

కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి చాలెంజిగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.ఈ సమావేశంలో సిఐ సైదులు, బాలరాజు, విజయ్ కుమార్, స్టేషన్ రైటర్లుపాల్గొన్నారు.