20 May, 2025 | 10:26 PM
19-05-2025 12:00:00 AM
ఈ రాత్రి
ఏ నిజానికి నిద్ర రాక
మనసంతా ఉక్కపోత
చల్లని నీ జ్ఞాపక సమీరంతో
అల్లుకున్న ఒక్కో కలతతో గడిపే
ఒక్కో మధుర యాత్రలో
కేరింతలు కొట్టే కళ్లను
కెరటం తాకే లోపే
నీకో పిచుక గూడు కట్టి
వెచ్చగా నిన్ను చూస్తూ
ఒదిగిన ప్రతి ఊహను
ఓ కవితగా పొదగాలని ఆశ
20-05-2025