19-05-2025 12:00:00 AM
చెట్టే నయం కదా ఇంటి పెరట్లో
పెరిగి అక్కడే కాపలా వుంది..
ఆ తరమే గొప్పది కదా ప్రేమల్ని
బంధాల్ని నిలుపుకొనేందుకు
జీవితాంతం త్యాగం చేస్తూనే పోయారు..
రెండు రూకల్ని విసిరితే
జీ హుజూర్.. అనే రోజులకన్నా
రెండు పలకరింపుల్ని తిని
నవ్వుకునే ఆ రోజులే నయం కదా!
నేను నేను అని కొట్టుకు చస్తున్నాము..
మేము మనము అనుకునే ఆ
స్నేహగీతం ఎంతో మధురం కదా!
పెద్దరికమేది.. మన వారేరి?
అంతా ఒంటరితనం..
మనసులు లేని మనుషులు..!
కాలాన్ని ఎంత ఉతికి ఆరేసినా
చిరుగాలికి
రాలుతున్న ఆకుల్ని చూస్తూ
చెట్టుకింద నీడలో ఒంటరిగా అదే నేను!!