30-10-2025 12:00:00 AM
 
							తెలుగు చిత్రపరిశ్రమకు మరో హీరోయిన్ దొరికేసింది. సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని వంశం నుంచి తొలిసారి హీరోయిన్‌గా జాన్వీ స్వరూప్ ఇండస్ట్రీలో అడుగు పెడుతోంది. మహేశ్‌బాబు మేనకోడలు, మంజుల కుమార్తె జాన్వీ సినిమాల్లోకి వస్తున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బుధవారం జాన్వీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కూతురి తెరంగేట్రం గురించి మంజుల అధికారికంగా వెల్లడించారు.
ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పంచుకున్న జాన్వీ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సంప్రదాయ లుక్ నుంచి మోడరన్ గ్లామర్ వరకు అన్నింటా మెరిసిపోయే లేలేత అందాలు జాన్వీ సొంతం. జాన్వీ ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్ ద్వారానే తన చార్మ్ చూపించింది. ఇండస్ట్రీ వర్గాలు ఆమెను ‘ఇటీవలి తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయి’గా అభివర్ణి స్తున్నాయి.
దర్శకులు ఆమె నటనను చూసి ‘మాటలకన్నా కళ్లతోనే భావాలను పలికించగల సహజ నటి’గా వర్ణించారు. నిర్మాతలు ఆమెను ‘దశాబ్దంలో ఒక్కసారి దొరికే ఆర్టిస్ట్, మాట్లాడకముందే స్క్రీన్‌ను ఆక్రమించే ప్రెజెన్స్’ అని చెబుతున్నారు. పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్ వంటి అంశాల్లో ఆసక్తి చూపిస్తుంటుందీ కొత్తం దం. జాన్వీ తల్లి మంజులకిది ప్రత్యేకమైన క్షణం. ‘నన్ను అడ్డుకున్న వారే ఇప్పుడు జాన్వీ కోసం ప్రార్థిస్తున్నారు.
జాన్వీ చిరునవ్వు నా ప్రార్థనలకు సమాధానం’ అంటున్న మంజుల మాటలే ఇందుకు నిదర్శనం. 2018లో ‘మనసుకు నచ్చిం ది’ సినిమాలో జాన్వీ బాలనటిగా అతిథి పాత్రలో కనిపించింది. మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు జాన్వీ ఎంట్రీపై అంతటా ఆసక్తి నెలకొంది. ఆమె నటించనున్న ప్రాజెక్టు వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.