calender_icon.png 11 January, 2026 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఈటీలతో అధికారుల భేటీ

09-01-2026 12:15:08 AM

కొత్తగూడెం, జనవరి 8 (విజయక్రాంతి ): సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యం లో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు ఈనెల 26న    నిర్వహించే 77 వ  గణతంత్ర దినోత్సవ సెంట్రల్ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని డీజీఎం (పర్సనల్) బి కేశవరావు ఆదేశించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శించే , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పై, కొత్తగూడెం లోని  వివిధ పాఠశాల, కళాశాలల నుండి వచ్చిన పిఈటి లతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు .

ఈ సంధర్భముగా  పాఠశాలల ,కళాశాలల నుండి వచ్చిన పిఈటి లతో 77 వ గణతంత్ర దినోత్సవ సెంట్రల్ వేడుకల లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎవరెవరు ఏమేమి సాంస్కృతిక  కార్యక్రమాలు ప్రదర్శిస్తారో, ఎంత మంది విద్యార్ధులు పాల్గొంటారో వివరముగా అడిగి తెలుసుకున్నారు. ఈ యొక్క వేడుకలలో మన సంప్రదాయాలు ఉట్టి పడేలా ప్రదర్శించి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం లో సహాయ పడాలని అన్నారు. 

ఈ కార్యక్రమములో ముకుంద సత్యనారాయణ,  డివై.పిఎం కే.శివకుమార్, సీనియర్ పిఓ ఎం.శ్రీనివాస్ కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, వెల్ఫేర్ పిఏ వర ప్రసాద్, బిఎస్జి కొ ఆర్డినేటర్ పి.సాయి నిరంజన్, సీనియర్  రోవర్ స్కౌట్ లీడర్లు  వి.వెంకట స్వామి, ఎల్.గోపాల కృష్ణయ్య మరియు పాఠశాలల , కళాశాలల నుండి వచ్చిన పిఈటి లు పాల్గొన్నారు.