25-12-2025 01:39:28 AM
రష్మిక లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పటికే విడుదలైన టైటి ల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లతో భారీ అంచనాలు నెలకొ న్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ గ్లిం ప్స్ విడుదల చేశారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో కథానాయిక తల్లి గొంతుతో వచ్చే డైలాగులతో రష్మిక పాత్రను పరిచయం చేశారు ‘నా బిడ్డ సచ్చిందన్నరు.. కానీ, మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక. గాలే ఆగిపోయింది.. నా బిడ్డ ఊపిరి మోయలేక. అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలే క. ఆఖరికి సావే సచ్చిపోయిం ది.. నా బిడ్డను సంపలేక.. నా బిడ్డ ఎవరో తెలు సా..’ అంటూ సాగే డైలాగులు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.
చివరలో రష్మిక చేసే గర్జన మైసా పాత్రలో దాగున్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రతీకారం తీర్చుకునే గోండు మహిళ పాత్రలో రష్మిక నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ప్ర ధానంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్; ఛాయాగ్రహణం: శ్రేయాస్ పీ కృష్ణ; స్టంట్స్: ఆండీ లాంగ్.