calender_icon.png 25 December, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చిందండి.. వడ్డీ కాంతమ్మ

25-12-2025 01:40:43 AM

సుడిగాలి సుధీర్‌గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్నకు మార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హైలెస్సో’. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతు న్న ఈ చిత్రంలో శివాజీ విలన్‌గా కనిపించ నుండగా, ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

బుధవారం అక్షరగౌడకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఆమెను ‘వడ్డీ కాంతమ్మ’గా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా, గెటప్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా, మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయా ళంలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్; డీవోపీ: సుజాత సిద్దార్థ్; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి.