calender_icon.png 26 November, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

26-11-2025 12:03:32 AM

-సీఎంతో మాట్లాడి నిధులు తెప్పిస్తా

-సంగారెడ్డి ఎమ్మెల్యేగా నిర్మలనే నిలబెడతా

-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి)/కొండాపూర్: కష్ట కాలంలో ఎవరైతే కాం గ్రెస్ కండువా కప్పుకుని తిరిగారో, డబ్బులు లేకున్నా వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి సంగారెడ్డి నియోజకవర్గంలో 84 గ్రామ పంచాయతీలను గెలిపించుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చా రు. మంగళవారం కొండాపూర్ మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించి న సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ లోకి వలస వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగాఎంపికచేయవద్దని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, బిసీ, ఎస్టీ రిజర్వేషన్ లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలు ఉంటే వారినే ఎంపిక చేయండి. ఆ గ్రామం లో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించాలని కోరారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు,  టీజిఐఐసి కార్పొరేషన్ చైర్ పర్సన్ నిర్మల సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ గా నిర్మల సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపన కోసం పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా నిర్మలనే పోటీ చేస్తుందని జగ్గారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు ముగ్గురు కలిసి నిర్మలనే  కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటుందని చెప్పానని తెలిపారు. తాను పోటీ చేస్తానని అనుకోవద్దని, నిర్మలనే అనుసరించాలని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎంలు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల సహకారంతో ఐఐటి, సంగారెడ్డి- ఫోర్ వే రోడ్ లైన్, ఆకొలా- నాందేడ్ రోడ్డు, సంగారెడ్డికి మంజీరా నీళ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు ఎన్నో మౌలిక వసతులు కల్పించానని తెలిపారు. మొన్న ఎన్నికల్లో తనను ఓడగొట్టినా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిధులు తీసుకువస్తున్నానని వివరించారు. సంగారెడ్డి నియోజకవర్గ గ్రామ పంచాయతీల ఎన్నికల కమిటీ సభ్యులుగా చేర్యాల ఆంజనేయులు, నిర్మల, తోపాజి అనంత్ కిషన్, రాంరెడ్డి, తోగర్పల్లి ప్రభు, చిద్రుప్ప రఘు గౌడ్ లు ఉంటారన్నారు.