calender_icon.png 29 January, 2026 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

29-01-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్, జనవరి 28 (విజయక్రాంతి): పరకాల మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక దృష్టిచారించిందని, టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ గెలు పే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ, ప్రజలతో ప్రత్యక్ష మమేకం కావాలని, ప్రజా ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి చేరవేయాలని అన్నారు.

ప్రజల విశ్వాసాన్ని బలపరిచే వ్యూహాత్మకంగా పనిచేసి, పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఇన్చార్జులు పనిచేయాలని, ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని సమన్వయం క్రమశిక్షణతో ముందుకెళ్ళినప్పుడే విజయం సాధ్యమవుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇంచార్జిలుగా నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, ఎనుకొంటి నాగరాజు, బంక సంపత్, పెరుమండ్ల రామకృష్ణ, బిల్ల ఉదయ్ కుమార్ రెడ్డి, తంగళ్ళపల్లి తిరుపతి, దేవరకొండ అనిల్ కుమార్, బత్తుల స్వాతి, మేడిపల్లి మదన్, గోలి రాజేశ్వరరావు లను నియమించారు.