calender_icon.png 2 August, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

01-08-2025 01:06:46 AM

కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగ చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం గుడిహాత్నూర్, బజార్ హాత్నూరు మండలంలోని రైతు వేదిక ల్లో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కార్థుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుడిహత్నుర్ 158, బజార్ హత్నర్ 160 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  అలాగే కూరగాయలు సాగు చేయాలని, ఇంటి ఆవరణలో పలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తదితర వాటిని విరివిగా పండించాలని సూచించా రు.

అంతకుముందు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... స్మార్ట్ కార్డులు త్వరగా అందించాలన్నారు ప్రత్యేకత లేని ఈ డెమో కార్డులతో ప్రజా ధనం వృధా అవుతుందన్నారు. రేషన్ షాపుల్లో కేవలం బియ్యమే కాకుండా నిత్యావసర సరుకులు సగం ధరకు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో రేషన్ కార్డు ఉన్న లేకున్నా అందరికి రేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే నాని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య,  అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ కవిత, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.