13-12-2025 05:32:16 PM
మణుగూరు (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన వర్స మంగమ్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాజీ జెడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసి గ్రామాభివృద్దికి అందరి సహాకారంతో కృషి చేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.