calender_icon.png 13 December, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవల్లి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష

13-12-2025 05:11:54 PM

ముకరంపుర (విజయక్రాంతి): శ్రీవల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక భగత్ నగర్ లో గల హరిహర అయ్యప్ప క్షేత్రం నందు అయ్యప్ప దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా శ్రీవల్లి సేవా సంస్థ నిర్వాహకురాలు పుష్పలత శ్రీనివాస్ మాట్లాడుతూ మేము గత ఎనిమిది సంవత్సరాల నుండి శ్రీవల్లి సంస్థ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు నిర్వహించబడుతున్న అన్నదాన సేవా కార్యక్రమంలో కూడా మా సంస్థ నుండి దాదాపుగా 30 మంది సేవా కార్యకర్తలు పాల్గొంటున్నారని తెలిపారు. ఈరోజు అయ్యప్ప స్వాములకు మా శ్రీవల్లి సేవా సంస్థ ద్వారా అన్న ప్రసాద వితరణ చేయడం ఆ భగవంతుడి ఆదేశంగా మేము భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా సేవా కార్యకర్తలకు, అయ్యప్ప స్వాములకు దేవాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.