calender_icon.png 2 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాధర్నాను విజయవంతం చేయండి

02-12-2025 12:00:00 AM

 అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 01:  తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా  డిసెంబర్ 3న నిర్వహించే మహా ధర్నాలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా కోశాధికారి సంరెడ్డి శశిపాల్ రెడ్డి అన్నారు.

హా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో స్థానిక జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, వృత్తి కమిటీలను ఏర్పాటు చేయాలని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ  కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు యాదయ్య, దర్శనం జంగయ్య, జర్నలిస్టులు గూడెపు జగన్ గౌడ్, చెరుకు వెంకటస్వామి, రాసాల వెంకటేష్ యాదవ్, నామ ఆంజనేయులు, కుంకుట్లపల్లి రాకేష్, బండ శేఖర్ రెడ్డి, యాచారం రాములు, దార్ల శ్రీనివాస్, నర్రి రమేష్, చాపల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.