calender_icon.png 2 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాహ్మయ్య మృతి కార్మికులకు తీరని లోటు

02-12-2025 12:00:00 AM

ఎల్బీనగర్ , డిసెంబర్ 1 : కార్మిక నాయకుడు కామ్రేడ్ పెండ్యాల బ్రహ్మయ్య మృతి కార్మికులు, పేదప్రజలకు తీరని లోటు అని సీఐటీయూ నాయకులు, కార్మికులు నివాళులర్పించారు. సోమవారం వనస్థలిపురం రైతు బజార్ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి  శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎల్లయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ... కార్మిక వర్గ నాయకుడు, సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెండ్యాల బ్రహ్మయ్య మృతి సీఐటీయూ, సీపీఎం పార్టీకి తీర్చలేనిదన్నారు. యాచారం మండలం గండ్లగూడ గ్రామానికి చెందిన  బ్రహ్మయ్య కార్మికుడిగా సీఐటీయూ సంఘానికి పరిచయమై జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదిగారన్నారు. 

కార్మిక సంక్షేమ కోసం బ్రమ్మాయ్య నిరంతరం పోరాటం చేశాడని గుర్తు చేశారు.  భవిష్యత్తు పోరాటంలో ఆయన చూపిన బాటలో పోరాటాలు నడపాలని వారు తెలియజేశారు.  వనస్థలిపురం లేబర్ అడ్డ ఉపాధ్యక్షుడు  భూష రాజు కాశయ్య, రైతు బజార్ యూనియన్ కార్యదర్శి అబ్బ భారతమ్మ, కార్మికులు వరలక్ష్మి, జయమ్మ లక్ష్మమ్మ, రమేశ్, పాండు, గుండా రెడ్డి, గాయత్రి, కాశమ్మ, వెంకటయ్య, ప్రేమ్  అర్జున్, సుధాకర్, చిట్టి వెంకటి, వెంకటేశ్ పాల్గొన్నారు.