calender_icon.png 8 July, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

08-07-2025 01:25:51 AM

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా  కలెక్టర్ పి ప్రావీణ్య  అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్  కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్‌ఓ పద్మజరాణి, లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.   

మెదక్ జిల్లాలో 61 ఫిర్యాదులు...

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.

భూ సమస్యలు- 29. ఇందిరమ్మ ఇండ్ల కొరకు -07, పింఛన్లు -04, ఇతర సమస్యలు -21  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ నగేష్, డి.ఆర్.ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య   లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.