calender_icon.png 12 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ క్రీడల్లో మెరిసిన వనపర్తి జిల్లా పోలీసు

12-08-2025 12:00:00 AM

వరల్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ అండ్ స్పోరట్స్‌మీట్‌లో -బంగారు పథకం

బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ కు సన్మానం 

వనపర్తి టౌన్, ఆగస్టు 11 : ప్రతిభ గల పోలీసు క్రీడాకారులను అన్ని విధాల ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడలలో జులై నెలలో  అమె రికా అలబామాలో నిర్వహించిన వరల్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వనపర్తి జిల్లా చెందిన ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్  పసుపుల కృష్ణారావు ఏ ఆర్ హెచ్ సి- 2077  రెండు బంగారు పతకాలను సాధించాడు.

ఈ సందర్బంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ ను పూలమాల శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..వనపర్తి జిల్లా పోలీసు సిబ్బందికి తమ విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను మరియు వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొ ందేలా మరియు నూతనత్తేజంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి క్రీడాలలో పా ల్గొనడానికి అనుమతిస్తూ ప్రోత్సహిస్తూన్నామని పేర్కొన్నారు.

జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్  పసుపుల కృష్ణారావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ తెలంగాణ పోలీసు వాటర్ స్పోరట్స్ విభాగానికి కోచ్ గా విధులను నిర్వహిస్తున్నాడు. అమెరికా అలబామాలో నిర్వహించిన వరల్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోరట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ 50 సంవత్సరాల విభాగంలో ప్రతిభ కనబర్చి గోల్ మెడల్ సాధించాడని ఈ ఆటలో 80 దేశాల నుంచి 8500మంది పాల్గొనగా పసుపుల కృష్ణారావు గోల్డ్మెడల్ సాధించాడన్నారు.

భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించి,దేశానికి, రాష్ట్రానికి, వనపర్తి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ ఆశభావాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమములో ఏఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి డిసిఆర్బి డిఎస్పీ, ఉమామహేశ్వరరావు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్,డిసిఆర్బీ ఎస్త్స్ర, తిరుపతి రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.