calender_icon.png 3 November, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సమస్యలతో యువకుడు ఆత్మహత్య..

02-11-2025 07:48:38 PM

బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రానికి చెందిన సంగెపు సాయికుమార్ ఆరోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బోథ్ ఎస్సై శ్రీసాయి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మైసమ్మ కాలనీలో నివాసముండే సాయికుమార్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్య తాగుడుకు బానిసై మనోవేదనతో బాధపడేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు.