08-09-2025 01:15:38 AM
కావ్యాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): యువభారతి సంస్థ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని ఇతర సాహిత్య సంస్థలతో కలిసి తెలుగు వెలుగు సమాఖ్య పేర ఆదివారం ఐఐఎంసి కళాశాల ప్రాంగణంలో కావున వేదిక, ఐఐఎంసి సంయుక్త ఆధ్వర్యంలో 11వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ పిహెచ్ నటరాజారావు రచించిన ‘మనిషీ..
ఒకసారి సిగ్గు పడు’ కావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువభారతి అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర, ఆచార్య వంగపల్లి విశ్వనాథం, కవన వేదిక అధ్యక్షుడు చీకోలు సుందరయ్య, రంజని అధ్యక్షులు జయంతి రాజా రాం, కవి నటరాజారావు, యువభారతి కార్యదర్శి జీడిగుంట, కావున వేదిక కార్యదర్శి రఘుశ్రీ తదితరులు పాల్గొన్నారు.