calender_icon.png 24 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి

24-08-2025 12:08:28 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీ లు తగిన గుణపాఠం చెబుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఘర్షణ పద్దతిలో కాకుం డా ప్రత్యామ్నాయ పద్దతి ఆలోచించి రిజర్వేషన్లను పెంచే న్యాయమార్గాన్ని మార్గాన్ని ఆలోచించాలని ఆయన కోరారు.

కేంద్ర ప్ర భుత్వంపై యుద్ధం ప్రకటించి ధర్నాలు చేస్తే సరిపోదని, బిసి సంఘాలు, ప్రజా సంఘాల చేయ వలసిన కార్యక్రమం బిసి రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంతో సానుకూలంగా ఉండి అఖిల పక్షంతో, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిష్కారించి సాధించాలన్నా రు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన హైదరాబాద్, ఇంది రాపార్కు వద్ద రాజ్యసభ సభ్యులు ఆర్. కృ ష్ణయ్య నేతృత్వంలో చేపట్టనున్న బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేష న్లపై వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలతో కూడిన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని కలిసి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్ర మంలో 25 న జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, బీసీ సంఘాల సమన్వయ వేది క రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, నీల వెంకటేష్ ముదిరాజ్, సీ. రాజేందర్ , అనంతయ్య, రాజు నేత మణికంఠ, పెద్ది జగదీష్ తదితరులు పాల్గొన్నారు.