calender_icon.png 17 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని వ్యక్తి మృతి

24-07-2025 11:00:40 PM

మిర్యాలగూడ (విజయక్రాంతి): మిర్యాలగూడ మండలం(Miryalaguda Mandal) తుంగపాడులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని పగడాల శ్రీనివాస్ రెడ్డి(55) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి శ్రీనివాస్ రెడ్డి తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా హాలియా నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి మృతికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పేద కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు కోదాడ - జడ్చర్ల రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆందోళన విరమింప చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.