24-07-2025 12:20:00 AM
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, జూలై 23:(విజయ క్రాంతి): ఒక బాలిక వెంటపడి పదే పదే వేదించిన గల్చడ్వాడ్ గజానంద్ కు ఐదు నెలల సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాల్ మేజిస్ట్రేట్ (ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ) ఖుష్భూ ఉపాధ్యాయ్ బుధవారం తీర్పు చెప్పారు.కోర్టు తీర్పులోని వివరాలు..
నిజామాబాద్ నగరంలోని మల్లెల రావు ( గోప్యత కోసం పేరు మార్చాము )కిషన్ గంజ్ లో ఒక తినుబండారాలు అమ్ముతుజీవిస్తాడు. అతని కూతురు కాలేజీకి వెళుతువస్తుంది. గల్చడ్వాడ్ గజానంద్ అనే వ్యక్తి పదహారేళ్ళ వయసు గల ఆమె వెంట పదే పదే పడుతు లేనివిపోనివి మీ తండ్రికి చెప్పి నీ పరువు తీస్తానంటూ బెదిరిస్తు, డబ్బులు డిమాండ్ చేయడంతో తండ్రి లాకర్ నుండి తండ్రికి తెలియకుండా యాభై వేలు తీసుకుని అతనికి ఇచ్చింది.
మల్లి మల్లి వెంట పడుతు తండ్రికి విషయం చెప్పింది. తండ్రి, కూతురు కలిసి గజానంద్ ను నిలదీయడంతో అతను తన బంధువులైన జ్ఞానేశ్వర్, దాదరావు లతో కలిసి 6 జనవరి, 2020 న మల్లెల రావు పై చాకు దాడి చేశారనే నేరారోపణలపై నేర న్యాయ విచారణ జరిపిన కోర్టు. బాలిక, ఆమె తండ్రి, ఇతర సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి,
ధ్రువీకరించుకున్న పత్రాలు పరిశీలించి ప్రధాన ముద్దాయి గజానంద్ పై ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 354(డి )ప్రకారం నేరం రుజువు అయినట్లు నిర్దారిస్తూ అతనికి ఐదు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు వెలువరించారు.జ్ఞానేశ్వర్, దాదరావు లపై నేరారోపణలు రుజువు కానందు న నిర్దోషులుగా విడుదల చేశారు.పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ రహీముద్దీన్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.