calender_icon.png 13 May, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి సీజన్ వచ్చేసింది..!

25-03-2025 12:13:48 AM

  1. గడ్డిఅన్నారం మార్కెట్‌లో కళకళలాడుతున్నమామిడి
  2. ఈ ఏడాది 1.50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం
  3. ఇప్పటి వరకు 60 వేల క్వింటాళ్లు వచ్చినట్లు అంచనా

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 24 : గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి సీజన్ ఆరంభమైంది. ఇంకా ఎండలు ముదరనే లేదు. వివిధ రాష్ట్రాల నుంచి మామిడి మార్కెట్‌కు పోటు ఎత్తుతుంది. సీజన్ దృష్టి పెట్టుకుని మార్కెట్ అధికారులు వ్యాపారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ  ఏడాది 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామి డి మార్కెట్‌కు వచ్చే అవకాశముంది. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం, అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు.

మార్కెట్‌లో దొంగలు పడే అవకాశం ఉండడంతో సీసీ కెమెరాలతో, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్, అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్‌లను అందుబాటులో ఉంచనున్నారు.  మామిడి రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వారు  రాత్రి సమయంలో జర్నీ చేస్తుంటారు. రైతుల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు గడ్డిఅన్నారం మార్కెట్‌కు దాదాపు 60 వేల క్వింటాళ్ల మామిడి వచ్చినట్లు తెలుస్తుంది.

గత  ఏడాది  ఈ రోజుతో పోలిస్తే ఈ ఏడాది ఈరోజు వరకు దాదాపుగా 3000 వేల క్విం టాళ్ల అదనంగా మామిడి మార్కెట్ వచ్చిం ది.  ఇందులో 8 రకాలు బినిషాన్, తొతుపూరి, నిటా, పెద్దరసలు, చిన్నరసలు, సుం దరీ మల్లిక, దసెరి, నీలం తదితర రకాలు మామిడి మార్కెట్‌లో అందుబాటులో ఉ న్నాయి. మార్కెట్ వచ్చిన దాంట్లో 70శాతం ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుంటాయి. మిగతా 30 శాతం లోకల్ వ్యాపారులు జరుగుతుంటాయి.

రైతు శ్రేయస్సు కోసం పని చేస్తాం

గడ్డి అన్నారం మార్కెట్‌కు ఈ ఏడాది 1.50 మెట్రిక్ లక్షల టన్నులు మామిడి వచ్చే అవకాశం ఉంది. మామిడి రైతులకు గిటుబాట ధర కల్పిస్తాం. ఇప్పటికే మామిడి సీజన్ మొదలైంది.  జూన్ 10 వరకు ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్కెట్ వచ్చే రైతులకు మౌ లిక సదుపాయల కల్పనలో వెనక్కి తగ్గకుండా అన్నీ రకాలు ఏర్పాటు చేశాం. రైతుల కు విశ్రాంతి, గదులు కానీ, అలాగే 3 వే బ్రిడ్జిలు ఏర్పాటు చేశాం. వచ్చే నెల నుంచి జూన్ వరకు మా పాలకవర్గం రైతులకు, వ్యా పారులకు 24 గంటలు అందుబాటులో ఉం టాం.  కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం.. రైతు శ్రేయస్సు కోసమే పనిచేస్తాం.

చిలుక మధుసూదన్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్

మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు  చేశాం

గడ్డి అన్నారం మార్కెట్ దాదాపుగా మా మిడి సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 60వేల క్వింటాళ్ల వచ్చింది. గత ఏడాది ఈ రోజుతో పోలిస్తే.. ఈ ఏడాది  ఈరోజు వరకు 3000వేల క్వింటాళ్లు అదనంగా మామిడి మార్కెట్ వచ్చింది. ఈ మా మిడిలో దాదాపుగా 8 రకాలు ఉన్నాయి. మార్కెట్ వచ్చే రైతులు, వ్యాపారులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేశాం.

ఎల్. శ్రీనివాస్, గడ్డిఅన్నారం మార్కెట్ కార్యదర్శి