25-03-2025 12:12:44 AM
హైదరాబాద్, మార్చి 24(విజయక్రాంతి): గృహజ్యోతి పథకం అమలు కోసం రాష్ట్ర ప్ర భుత్వం రూ.156కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగించుకునే ఇళ్లకు ఉచితంగా పవర్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నెలలో గృహజ్యోతి పథ కం కింద ఈ నిధులను డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.