05-09-2025 01:35:01 AM
-భారత్‌లో వీక్షించేందుకు అవకాశం
-నేరుగా చూసినా ప్రమాదమేమీ ఉండదు
-107 నిమిషాల పాటు ఎరుపురంగులో ఉండనున్న చంద్రుడు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రతిరోజు చంద్రు డు మనకు దర్శనం ఇచ్చే వెండి వర్ణంలో కాకుండా ఎర్రటి వర్ణంలో కనిపించడాన్ని బ్లూ మూన్ (సంపూర్ణ చంద్రగ్రహణం) అం టారు. సెప్టెంబర్ 7న ఆదివారం రోజు సం పూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చం ద్రగ్రహణం భూమ్మీద ఉన్న అనేక ప్రాంతాలతో పాటు భారత్‌లో కూడా వీక్షకులకు కనువిందు చేయనుంది.
భ్రమణ, పరిభ్రమణాల్లో భాగంగా భూమి, చంద్రుడు, సూ ర్యుడు ఒకే సరళరేఖలోకి రావడంతో పాటు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి ఎంత సేపు అడ్డు ఉంటుందనే విష యం మీద గ్రహణ సమయం ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయి.. చీకటిమయంగా మారుతాడు. దీన్నే ఉంబ్రా అని పిలుస్తారు.
సూర్యగ్రహణాల మాదిరిగా కాకుండా చం ద్రగ్రహణాలు తక్కువ సమయం పాటు మా త్రమే ఉంటాయి. చంద్రగగ్రహణం సంభవించినపుడు గోళానికి ఒక వైపు ఉండే బిలి యన్ల మంది చూసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సూర్యగ్రహణాలు నేరుగా చూడ టం వల్ల ప్రమాదం సంభవిస్తుంది. సూర్యగ్రహణాలు చూడాలంటే ప్రత్యేక పరికరాలు కావాలి. వాటిని ధరించి మాత్రమే సూర్యగ్రహణాలు చూసేందుకు వీలుంటుంది. చంద్రగ్రహణాలను మాత్రం సులభంగా చూసేందుకు వీలుంటుంది. మాములుగా ఎటువంటి ప్రత్యేక పరికరాలు ధరించకుం డా కూడా చంద్రగ్రహణాలు చూడొచ్చు.
చంద్రుడు ఎరుపు రంగులోకి మారేందుకు కారణం..
చంద్రగ్రహణం సంభవించిన సమయంలో చంద్రుడిపై భూగ్రహం నీడ పడు తుంది. దాంతో చంద్రుడు పూర్తిగా మసకబారిపోతాడు. కానీ కొన్ని సార్లు మాత్రం ఎరుపురంగులో ప్రకాశిస్తాడు. ఇటువంటి సందర్భాన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సూర్యకాంతి భూవాతావరణం గుండా వెళ్తున్నపుడు తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఉ దా రంగు) చెల్లాచెదురుగా ఉంటాయి.
ఆ స మయంలో ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరు పు, నారింజ) వంగి పయనిస్తాయి. ఈ ఎర్ర టి కిరణాలు భూమి చుట్టుకుంటూ చంద్రుడిపై పడతాయి. ఆ సమయంలో చంద్రుడు ఎరుపురంగులోకి మారతాడు. ఈ సెప్టెంబర్ 7వ తేదీన సంభవించే చంద్రగ్రహణం ఆసియా, యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లోని ప్రాంతాల్లో కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సాధారణంగా ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ప్రాంతాన్ని బట్టి చం ద్రగ్రహణం మనకు కనిపించే విధానంలో మార్పులు ఉంటాయి.