02-05-2025 01:42:27 AM
ఆక్స్‌ఫర్డ్ ఫోరమ్ సదస్సుకు ఆహ్వానం
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరు దైన గౌరవం దక్కింది. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో జరిగే ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సు కు ముఖ్యవక్తగా హాజరుకావాలంటూ వర్సి టీ నుంచి ఆహ్వానం అందింది.
‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడుతారని ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం సంస్థ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ వెల్లడించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ వి ద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే, చర్చ లు మరింత ఆసక్తికరంగా ఉండ టంతో పాటు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగమయ్యేందుకు వారందరికీ స్ఫూ ర్తిగా ఉంటుందని సిద్ధార్థ్ సేఠి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో భారతదేశ ప్రగతి పథాన్ని, తెలంగాణలో అమలు చేసిన వినూ త్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌ను కేటీఆర్ వివరించనున్నారు.