02-05-2025 01:41:07 AM
తెలంగాణ భవన్‌లో మేడేలో బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్‌కు అన్నివర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండటం వల్లే ప్రత్యేక రాష్ట్ర కాంక్ష సిద్ధించిందని శాసనమండలి ప్రతిపక్షనేత మధు సూ దనాచారి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ నేతలు మే డే ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన కార్మి కులను ఉద్దేశించి మధుసూదనాచారి మా ట్లాడుతూ.. శ్రమ దోపీడీపై ఏండ్ల పోరాటం తర్వాత ఏర్పడ్డదే మే డే అని మధుసూదనా చారి చెప్పారు. పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికులు పరిరక్షించు కోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
అన్యాయాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్‌ఎస్, బీఆర్టీయూ మాత్రమేనన్నారు. కులగణన, జనగణన పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందని, కేసీఆర్ ప్రభుత్వం లో బీసీలకు ఉద్యోగాల్లో, పథకాల్లో ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. తెలంగాణలో మొద టి స్పీకర్‌గా తనను, మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌లను నియమించారని గుర్తు చేశా రు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కార్మిక విభాగం ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెండింగ్ ఐదు డీఏలను చెల్లించకుంటే ఎం దుకు నోరు మూసుకొని కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్టీయూ అధ్య క్షు డు రాంబాబు యాదవ్, జీహెచ్‌ఎంసీ ఎం ప్లాయీస్ నేత బాలకృష్ణ పాల్గొన్నారు.