02-05-2025 01:40:58 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): కుల గ ణనలో జన గణ న చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సంఘాల మనోభావాలను ప్రధాని మోదీ గుర్తించారని, ఇది సామాజిక న్యాయ చరిత్రలో ముందడుని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కు ల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశా రు.