26-11-2025 12:00:00 AM
తుర్కయంజాల్, నవంబర్ 25: హరిత, స్థిరమైన భవిష్యత్తే ధ్యేయంగా పర్యావరణ పరిరక్షణకు సెయింట్ పాల్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ముందుకొచ్చింది. తుర్కయంజాల్లో ఈసీజీ ఫౌండేషన్తో కలిసి సెయింట్ పాల్స్ కాలేజీ యాజమాన్యం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 2వేల మందికి పైగా విద్యార్థులు, 200మంది అధ్యాపకులు, ఈసీజీ వాలంటీర్లు కలిసి 10వేలకు పైగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డా.లక్ష్మీకాంతం, బ్రిటిష డిప్యూటీ హై కమిషనర్ గారెట్ విన్ ఓవెన్, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, ఐఎఫ్‌ఎస్ డా.బి.ప్రభాకర్, ప్రొ. డా.జీవీ ప్రకాశ్, ప్రిన్సిపల్ డా.కిరణ్మయి, సెంట్ కాలేజీ డైరెక్టర్లు రాఘవరెడ్డి, సుధీర్ కొట్ల మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడం, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో సెయింట్ కాలేజీ ముందడుగు వేసిందని కొనియాడారు. పర్యావరణ సంరక్షణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని వక్తలు సూచించారు.