04-10-2025 06:48:13 PM
ఆరు సెల్ ఫోన్లు, బైక్, నగదు స్వాధీనం..
మణుగూరు (విజయక్రాంతి): పేకాట ఆడుతున్న తొమ్మిది మంది యువకులను అరెస్టు చేసినట్లు సీఐ పాటీ నాగబాబు తెలిపారు. మున్సిపాలిటీలోని ఆదర్శ్ నగర్ లో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారం మేరకు శనివారం పేకాట స్థావరంపై దాడి చేయగా తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వారి వద్ద నుండి రూ.8,030 నగదు, బైక్, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.ఐ సిహెచ్. నాగేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.