08-07-2025 01:56:18 AM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ టౌన్, జులై 7 : పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన (23,38,000 రూపాయల) చెక్ లను అందచేసి మాట్లాడారు.
పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప సీఎం ఆర్ ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పెదప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.