calender_icon.png 27 October, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్

27-10-2025 12:38:48 AM

మందమర్రి, అక్టోబర్ 26 : మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీని సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ప్రాజెక్ట్  స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓసిపి వ్యూ పాయింట్ నుంచి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు.

ఆఫ్ లోడింగ్, ఎక్స్ప్రెస్వే ప్రతినిధులను వెంటనే ఓబీ వెలికితీత పనులు ప్రారంభించాలని సూచించారు. డైరెక్టర్ వెంట ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ ఎన్ పైడయ్య, ఎక్స్ప్రెస్వే ప్రతినిధులు పాల్గొన్నారు.