3 April, 2026 | 5:20 AM

గంజాయి పట్టివేత

07-11-2024 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): పలు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించి 4.3 కిలోల గంజాయి ని, మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నా రు. సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు బృందం బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో తనిఖీలు నిర్వహించి, గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన కూనసేవ్‌ను పట్టుకొని, 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మియాపూర్‌లో ఎస్టీఎఫ్ సీఐ సుభాష్‌చందర్‌రావు తనిఖీలు చేసి గంజాయి మొక్కలు పెంచుతున్న అస్సాంకు చెందిన భరత్‌భూయ్యాను అదుపులోకి తీసుకున్నా రు. నేరేడ్‌మెట్ వినాయకనగర్‌లో ఎస్టీఎఫ్ సీఐ బాలరాజు బృందం ఓ ఇంట్లో సోదాలు చేసి 1.60 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితురాలు పాహిమాబేగం ను అరెస్ట్ చేశారు.