19-07-2025 12:37:01 AM
కట్ట లింగస్వామి, మిర్యాల భరత్, డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శిలు
మునుగోడు,జులై 18 (విజయ క్రాంతి ): యువత పెడదారిన పట్టకుండా గంజాయి డ్రగ్స్ లోన్ యాప్‌లను అరికట్టాలని డివైఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శులు కట్ట లింగస్వామి, మిర్యాల భరత్ అన్నారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో యువ చైతన్య సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని జులై 24 న నకరేకల్ లో ప్రారంభమై ఆగస్టు 02 న మిర్యాలగూడ వరకు జరిగే యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనేకచోట్ల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని గుర్తు చేశారు, యువతీ యువకులు తెలిసి తెలవని వయసులో చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల వైపు యువత వెళ్లకుండా, వారి దగ్గరకు ట్రిక్స్ అనే మహమ్మారి దరి చేరకుండా యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమం జయప్రదానికై అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువతి యువకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, మండల కమిటీ సభ్యులు కంభంపాటి రవి, కర్నాటి స్వామి, ప్రభాస్, నరేష్ ఉన్నారు.