19-07-2025 12:34:47 AM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాల ఆవరణంలో శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర వాటిపై పరీక్షలు నిర్వహించారు. అనంతరం రక్తం తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జే పురుషోత్తం, సింగరేణి వైద్య సిబ్బంది మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఆరోగ్యం పట్ల సింగరేణి యాజమాన్యం చూపుతున్న చొరవను అభినందిస్తూ, సింగరేణి యాజమాన్యానికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, పాఠశాల సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.