calender_icon.png 3 November, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత..

02-11-2025 11:04:43 PM

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ గ్రామంలో కుమ్ర భీంరావు తన పంట చేనులో గుట్టుచప్పుడు కాకుండా పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం కుమ్ర భీంరావు తన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది, పత్తి పంటను సాగు చేస్తున్నాడని, అందులో అంతర పంటగా 20 గంజాయి సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారం ప్రకారం గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ భూమి సందర్శించి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కుమ్ర భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.