03-11-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 2 : బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం ఆగడం లేదు. ఎవరికి తోచినట్టుగా వారు వ్యక్తి గతంగా, పలుకుబడి మాటునా కబ్జాలు షరామామూలయ్యాయి. పట్టణంలోని 85 డీప్ ఏరియాలో సింగరేణి భూముల కబ్జా ఘట్టంపై అధికారులు కొరడా ఝులిపించి 24 గంటలు గడవకముందే 65 డీప్ బస్తి శివారులో మరో భూ అక్రమణ వెలుగు చూడడం గమనార్హం. 65 డీప్ ఏరియాలోని పాత కల్లు దుకాణం ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది. సుమారు ఎకరం (40 గుంటలు) వరకూ ఆక్రమించి ఏకంగా సిమెంట్ పోల్స్ ను హద్దులుగా పాతారు.
చోద్యం చూస్తున్న అధికారులు..
ప్రభుత్వ భూములు ఎక్కడికక్కడా ఆక్రమణకు గురవుతుంటే అధికారులు మాత్రం తమకేమి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి కబ్జా జరిగినట్టు ప్రచారంలో ఉంది. కానీ ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లకపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో యంత్రాం గం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆస్తుల పరిరక్షణ అధికారుల నిఘా అనునిత్యం ఉండాలి.
అలాంటి పటిష్టమైన సంక ల్ప దృష్టి యంత్రంగంలో కరువైందనీ భూకబ్జాల దృష్టాంతమే స్పష్టం చేస్తున్నది. ఇలా అధికారులు నిద్రమత్తులో ఉన్నంతకాలం భూకబ్జా కారులు తమ పని తాము యదేచ్ఛగా కానిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. విలువైన భూములు కబ్జాకో రుల పరం అవుతున్నాయి. అధికారుల ఉదాసీనత ప్రభుత్వ భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
ఇలా అయితే ఖాళీ స్థలాలు దక్కవ్..
ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికార వర్గాల్లో నెలకొన్న నిర్లక్ష్యం కబ్జా కారులకు కలిసొస్తుంది. సింగరేణిదైన, ప్రభుత్వ స్థలమైనా కబ్జాకోర్ల నుంచి తప్పించుకోలేనీ దయనీయతలో భూములు ఉన్నా యి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు.. కబ్జాకోరులకు కనీస అండదండలు లేకుండా ప్రభుత్వ భూములను ఎలా ఆక్రమిస్తారన్నది స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ భూములను కాజేసే ధైర్యం వారికెక్కడిదన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. వ్యక్తులుగా ఇలా భూకాబ్జాలకు పాల్పడే ధైర్య సాహసాలు ఎవరూ చేయరు. అధికారుల నోటీసులో లేకుండా ఎకరాల కొద్ది భూ అక్రమణలు చోటు చేసుకోవడం సాధ్యం కాదు.
బెల్లంపల్లిలో ఇటీవల కాలంలో భూకబ్జాలు కలకలం రేపుతున్నాయి. అధికారులను కలవర పెడుతున్న స్థాయిలో కబ్జాలు పెట్రేగిపోతున్నాయి. ఓవైపుగా కబ్జా స్థలాలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నప్పటికీ మరోవైపుగా కబ్జాదారులు రెచ్చిపోయి భూ ములను చెరపట్టడంలో ఆంతర్యం ఏంటి అన్నది అందరిని వేధిస్తున్న ప్రశ్న. భూకబ్జాలను అడ్డుకట్టేందుకు అధికారుల్లో కాసింత చలనం లేకపోవడం పై ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇకనైనా అధికారులు భూ కబ్జాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. కబ్జాదారులపై యుద్ధ ప్రాతిపదికన కఠోర శాశ్వత నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధి కారులూ ఇలాగే ఉంటే..? బెల్లంపల్లిలో ప్రజా అవసరాలకు, అభివృద్ధి పనులకు సెంటు భూమి కూడా మిగలదన్నది జగమెరిగిన సత్యం.